విశ్వ నటుడు కమలహాసన్ వారసురాలు అయిన ఈమె తొలుత సంగీత దర్శకురాలిగా తన తండ్రి నటించిన ఉన్నైప్పోల్ ఒరువన్ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు.
ఆ తరువాత నటిగా తెరంగేట్రం చేశారు. హిందీలో లక్ చిత్రం, తెలుగులో అనగనగా ఒక ధీరుడు చిత్రాల్లో నటించిన తర్వాతే కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.
తన గ్లామరస్ ఫోటోలను సామాజిక మాధ్యమాలలో విడుదల చేస్తూ నెటిజన్లకు బాగానే పని చెబుతుంటారు.
అదేవిధంగా నిజాలను నిర్భయంగా చెప్పే నటి ఎవరైనా ఉన్నారంటే అది శ్రుతిహాసనే.
తన ప్రియుడితో కలిసిన ఫొటోలను ధైర్యంగా సామాజిక మాధ్యమాలకు తెలియజేసే నటి ఈ బ్యూటీ.
ఇప్పటికే రెండు మూడు సార్లు ప్రేమలో విఫలమైన శ్రుతి మళ్లీ ప్రేమలో పడినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతోంది.
కాగా ఇటీవల ఈమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తన తొలి క్రష్ నటుడు ఎవరన్న ప్రశ్నకు ఏ మాత్రం తడుముకోకుండా హాలీవుడ్ నటుడు బ్రూస్‌లీ అని చెప్పారు.