ప్రస్తుతం తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘కీడా కోలా’

భరత్‌ కుమార్‌, శ్రీపాద నందిరాజ్‌, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్‌ కౌశిక్‌, సాయికృష్ణ గద్వాల్‌, విజయ్‌ కుమార్‌ సంయుక్తంగా విజి సైన్మా బ్యానర్ పై  నిర్మిస్తున్న చిత్రమిది

ఎనిమిది ప్రధాన పాత్రల చుట్టూ సాగే ఈ మూవీలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు

ప్రతి ఒక్కరికీ వాళ్ల తాత గుర్తు వచ్చేలా వరదరాజు పాత్రతో బ్రహ్మానందం మెప్పించనున్నారు

ఇప్పటివరకు చూడని ఓ సరికొత్త రూపంలో ఆయన సందడి చేస్తారని సినీవర్గాల సమాచారం

బ్రహ్మానందం జన్మదిన వేడుకలు పురస్కరించుకొని బుధవారం ఈ చిత్రంలో ఆయన లుక్‌ని విడుదల చేశారు