బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ పోతినేని హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే

ఈ చిత్రంలో రామ్ సరసన శ్రీలీల నటిస్తుంది

‘అఖండ’ లాంటి విజయం తర్వాత బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రమిది

శ్రీనివాసా చిట్టూరి నిర్మస్తున్న ఈ చిత్రం తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది

మాస్ ఎంటర్టైనర్ రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదీని తాజాగా ప్రకటించింది చిత్రబృందం

అక్టోబరు 20న వస్తున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు హీరో రామ్‌

ఈ చిత్రం ఈ ఏడాది దసరా సందడిలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది

ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు అందిస్తున్నారు