మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తన నటనా టాలెంట్ తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించాడు.

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా నిలిచారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారారు రామ్ చరణ్.

అలాంటి రామ్ చరణ్ కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

 ఇంతటి పాపులారిటీ ఉన్న హీరో బయటకు వెళ్తే అభిమానులు ఫోటోలు, సెల్ఫీల కోసం తప్పకుండా ఎగబడతారు.

కానీ రామ్ చరణ్ ఎవరిని కూడా హర్ట్ చేయకుండా అందరికీ టైం ఇస్తూ వారితో ఫోటోలు దిగుతారు.

 రామ్ చరణ్ తన సమీపంలో ఉన్నాడని తెలుసుకున్న ఓ బాలుడు సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుంటూ హీరో దగ్గరికి వెళ్లబోయాడు.

ఇంతలో కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది తనని గమనించి అడ్డుకున్నారు. దీంతో ఆ బాలుడు అక్కడే కన్నీరు పెట్టుకున్నారు.

 ఇది గమనించిన రామ్ చరణ్ సెక్యూరిటీ సిబ్బందికి నచ్చజెప్పి బాలుడిని దగ్గరికి పంపమన్నాడు. కాసేపు మాట్లాడి ఫోటో కూడా దిగాడు.

అలా ఫోటో దిగుతున్న సమయంలో ఆ బాలుడు చాలా భావొద్వేగానికి గురయ్యాడు. దీంతో రామ్ చరణ్ ఆ బాలున్ని ఓదార్చి ఫోటో దిగడానికి ఫోజులిచ్చాడు.