జాన్వీ కపూర్‌కు తోడి కోడలుగా వెళ్లనున్న ఆ స్టార్ హీరోయిన్ !

TV9 Telugu

21 May 2024

ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో అతిలో క సుందరి శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ కూడా ఒకరు.

అయితే ఈ మధ్యన ఈమె సినిమాల కంటే లవ్, డేటింగ్, రిలేషన్ షిప్ తదితర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోందీ అందాల తార.

సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్ ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే మరో స్టార్ హీరోయిన్ సారా అలీఖాన్ కూడా త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నట్లు తెలుస్తోంది.

సుశీల్ కుమార్ షిండే మరో మనవడు వీర్ పహారియా సారా అలీఖాన్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

ఒక వేళ భవిష్యత్ లో ఇదే రూమర్ నిజమైతే మాత్రం  జాన్వీ కపూర్, సారా అలీఖాన్ ఒకే ఇంటి నుండి కోడళ్లు అవుతారు.

అయితే ఈ  వార్తలపై ఇప్పటి వరకు నటి సారా అలీ ఖాన్ గానీ, ఆమె కుటుంబం గానీ స్పందించిన దాఖలాలు మాత్రం లేవు.

ప్రస్తుతం సారా అలీఖాన్ మెట్రో సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉంటోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో పూర్తి కానుంది.