15 September 2023

కోలీవుడ్‏లోకి ఎంట్రీ ఇస్తోన్న శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్.. 

Pic credit - Instagram

దివంగత హీరోయిన్ శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. కోలీవుడ్‏లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. 

ది అర్చీస్ తో నటిగా తెరంగేట్రం చేసిన ఖుషి కపూర్.. మ్యూజికల్ కామెడీ ఫిల్మ్ గా ఇది సిద్దమవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. 

 ఇక త్వరలోనే ఖుషి తమిళ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ హీరో అధర్వ సరసన ఆమె కథానాయికగా కనిపించనున్నారని సమాచారం. 

విఘ్నేశ్ శివన్ వద్ద అసిస్టింట్ గా పనిచేసిన ఆకాశ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారని తెలుస్తోంది. ఫీల్ గుడ్ ప్రేమకథగా ఈ మూవీ రాబోతుంది. 

ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ కోసం ప్రయత్నిస్తున్న ఖుషి తక్కువ సమయంలోనే కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 

ఖుషి కపూర్ 2000 నవంబర్ 5న జన్మించారు. ధీరూబాయ్ అంబానీ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తిచేసిన ఖుషి.. ఆ తర్వాత లండన్ ఫిల్మ్ స్కూల్లో నటన శిక్షణ తీసుకుంది. 

ది ఆర్చీస్ కామిక్స్ సిరీస్ ఆధారంగా తెరకెక్కుతున్న ది ఆర్చీస్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో సుహానా ఖాన్, రోహిత్ చెత్రీలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. 

 ఇక ఇటు ఖుషి సోదరి జాన్వీ కపూర్ సైతం సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు ఖుషి కూడా దక్షిణాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.