16 September 2023
చీరకట్టులో మంత్రముగ్దులను చేస్తోన్న కరీనా కపూర్..
Pic credit - Instagram
ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ కరీనా కపూర్. సల్మాన్ ఖాన్, షారుఖ్, హృతిక్ రోషన్ చిత్రాల్లో నటించింది.
కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే హీరో సైఫ్ అలీ ఖాన్ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు.
ఈ బాలీవుడ్ బ్యూటీ వయసు పెరుగుతున్నా కొద్ది అందంగా మారుతుందా అన్నట్లుగా కనిపిస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యా్న్స్.
తాజాగా పూల చీరకట్టులో మరింత అందంగా కనిపిస్తోంది కరీనా. ఆకట్టుకునే ఫిజిక్ తోపాటు మరింత అందంగా కనిపించి స్కిన్ టోన్ ఆమె సొంతం.
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేయడమే కాదు.. తన పిల్లలతో గడిపే సమయాన్ని ఫాలోవర్లతో పంచుకుంటుంది.
ప్రస్తుతం 42 ఏళ్ల వయసులోనూ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది కరీనా. అంతేకాకుండా అటు షోస్, యాడ్స్, షూట్స్ అంటూ ఏదో ఒకటి చేస్తుంది.
ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఇలాంటి చీరక్టటులో ఫోటులకు ఫోజులిస్తూ వావ్ అన్నట్లుగా అందరితో కామెంట్స్ సొంతం చేసుకుంటుంది.
ఇప్పుడు కరీనా చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఈ ఏడాదిలో ఒక చిత్రం రిలీజ్ కాబోతుండగా.. మరో రెండు సినిమాలు చర్చ దశలో ఉన్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి.