ఓహో..కంగనా దక్షిణాది సినిమాలు చేయడానికి కారణమదేనా?
TV9 Telugu
17 March 2024
బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ కంగనా రనౌత్. అయితే గత కొన్నేళ్లుగా ఆమెకు ఏవీ కలిసిరావట్లేదు.
బాలీవుడ్‌లో ఈ మధ్యన కంగనా నటించిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. నిర్మాతలను నిండా ముంచేశాయి.
అదే సమయంలో కంగనా దక్షిణాది భాషా సినిమాల్లోనూ నటించింది. తలైవి, చంద్రముఖి 2 సినిమాల్లో సందడి చేసింది.
అయితే సౌతిండియాలోనూ ఈ అందాల తారకు చుక్కెదురైంది. ఇప్పుడు మరో తమిళ సినిమాకు కంగన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
తంలో కంగనతో తలైవి సినిమా తీసిన డైరెక్టర్ ఏఎల్ విజయ్.. ఇప్పుడు తన కొత్త ససినిమాలోనూ కంగననే హీరోయిన్ గా తీసుకున్నారట.
ఓ స్టార్ హీరో నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందట. త్వరలోనే కంగనాను హీరోయిన్ గా అధికారికంగా ప్రకటిస్తారట.
ఇదిలా ఉంటే బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యన సక్సెస్ రేట్ బాగా పడిపోయింది. భారీ సినిమాలు బోల్తా పడుతున్నాయి.
అదే సమయంలో సౌత్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవుతున్నాయి. అందుకే దక్షిణాదిపైనే కంగనా ఫోకస్ పెట్టిందట.
ఇక్కడ క్లిక్ చేయండి..