నెక్లెస్‌పై బాయ్ ఫ్రెండ్ పేరు.. డేటింగ్ పై జాన్వీ హింట్!

TV9 Telugu

10 April 2024

బాలీవుడ్‌ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌ గురించి సినీ జనాలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.

ఇప్పటికే హిందీ చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోన్న జూనియర్ శ్రీదేవి  జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

అలాగే ఉప్పెన ఫేమ్‌ బుచ్చి బాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్  హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలోనూ హీరోయిన్‌ గా ఎంపికైంది జాన్వీ కపూర్.

ఇదిలా ఉంటే సినిమాలతో పాటు డేటింగ్, లవ్, రిలేషన్ షిప్  విషయాలతోనూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది జూనియర్ శ్రీదేవి.

శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్ డేటింగ్ లో ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఇటీవల జాన్వీ తిరుమలకు వెళ్లినప్పుడు శిఖర్ కూడా ఆమె వెంట ఉన్నారు.

తాజాగా జాన్వీ కపూర్ అజయ్ దేవ్‌ గణ్ మైదాన్‌ సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లింది. అదే సమయంలో అక్కడున్న వారి ఫొటోలకు పోజులిచ్చింది.

ఈ ఫోటోల్లో జాన్వీ కపూర్‌ ధరించిన నెక్లెస్‌పై శిఖు అని రాసి ఉంది.  జాన్వీ ఈ పేరుతోనే అతన్ని ముద్దుగా పిలుస్తుందని బాలీవుడ్ లో టాక్.

మొత్తానికి జాన్వీ పాప శిఖర్ పహారియాతో డేటింగ్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలకు నెక్లెస్, దానిపై ఉన్న పేరు మరింత బలాన్ని చేకూర్చాయని చెప్పవచ్చు.