హృతిక్ రోషన్ ముద్దు పేరు వింటే షాక్ అవుతారంతే

TV9 Telugu

15 April 2024

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇతనికి భారీగా ఫ్యాన్స్ ఉన్నారు.

ఇటీవల ఫైటర్ సినిమాతో అభిమానులను పలకరించాడు హృతిక్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి వార్ 2 అనే సినిమాతో మన ముందుక రానున్నాడీ బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో

అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముంబైలో ప్రారంభమైంది. ఎన్టీఆర్ కూడా జాయిన్ అయ్యాడు.

సినిమాల సంగతి పక్కన పెడితే హృతిక్ రోషన్ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే..

సాధారణంగా అందరికీ ముద్దు పేర్లు ఉంటాయి. అయితే హృతిక్ ముద్దు పేరు మాత్రం చాలా విచిత్రంగా ఉంది.

ఇంతకీ హృతిక్‌ రోషన్‌ పెట్‌ నేమ్ ఏంటో తెలుసా?‌ దుగ్గూ. అయితే ఈ పేరుకి, హృతిక్‌ వాళ్ల నాన్నకు ఏదో చిన్న సంబంధముందట.

ఇక హృతిక్ రోషన్ తండ్రి, ప్రముఖ దర్శకుడు రాకేశ్ రోషన్ కు కూడా గుడ్డూ అని ముద్దు పేరు ఉందట.