ఆ యంగ్ హీరోను తొక్కేయాలని చూస్తోన్న సీనియర్ హీరోలు
07 July 2025
Basha Shek
అన్ని రంగాల్లో మాదిరే సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య పోటీ ఎప్పుడూ ఉండేదే! ఇందులో ఆశ్చర్యమేమీ లేదు.
అయితే కొత్తగా వచ్చే హీరోహీరోయిన్స్ ఎదుగుతున్నారంటే కొందరు బడా స్టార్స్ అస్సలు తట్టుకోలేరని సినిమా ఇండస్ట్రీలో టాక్ ఉంది.
ఈ కారణంగానే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లాంటి ట్యాలెంటెడ్ యంగ్ హీరోలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది.
ఎంతో భవిష్యత్ ఉన్న సుశాంత్ ది ఆత్మహత్య అని కొందరు అంటుంటే.. మరికొందరు హత్య అని బల్ల గుద్ది చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ లోని చీకటి కోణంపై ప్రముఖ సింగర్ అమాల్ మాలిక్ ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయట పెట్టాడు.
ప్రస్తుతం బాలీవుడ్ లో దమ్మున్న హీరో కార్తీక్ ఆర్యన్ ను తొక్కేయాలని కొందరు హీరోలు ప్రయత్నిస్తున్నారని అమాల్ మాలిక్ తెలిపాడు.
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతోన్న కార్తీక్ ను ఇండస్ట్రీ నుంచి బయటకు పంపించేందుకు దాదాపు వంద మంది ప్రయత్నిస్తున్నారు.
ఈ బ్యాచ్ లో చాలా మంది పెద్ద హీరోలు, దర్శకులు నిర్మాతలు.. ఎందరో ఉన్నారు అని చెప్పుకొచ్చాడు అమాల్ మాలిక్.
ఇక్కడ క్లిక్ చేయండి..