బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం హైదరాబాద్‏లో సందడి చేస్తున్నారు.

ఆయన నటిస్తోన్న కభీ ఈద్ కభీ దివాళీ సినిమా గత కొద్ది రోజులుగా భాగ్యనగరంలోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. 

ఈ క్రమంలో బుధవారం సినీ కార్మికుల సమ్మె కారణంగా ఆయన  సినిమా షూటింగ్‏కు బ్రేక్ పడింది.

దీంతో విరామ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్‏లతో కలిసి ఓ ప్రైవేట్ పార్టీలో సందడి చేశారు సల్మాన్..

తాజాగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‏తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‏లో పాల్గోన్నారు..