పాన్ ఇండియా స్టార్డమ్ వచ్చాక హీరోల నుండి చకచకా సినిమాలు వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు.

ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా క్రేజ్ వచ్చాక.. దర్శకుడు కొరటాల శివతో ‘NTR30’ మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే.

కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడని చెప్పి దర్శకుడు కొరటాల అంచనాలు పెంచేశాడు.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. కేజీఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయనున్నాడు.

ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్.. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ తో ఓ సినిమా చేయనున్నాడని కొత్తగా టాక్ మొదలైంది

అదికూడా ప్రెజెంట్ ప్రభాస్, అల్లు అర్జున్ లతో సినిమాలు నిర్మిస్తున్న టిసిరీస్ భూషణ్ కుమార్ తో అని తెలుస్తోంది.

రీసెంట్ గా ఎన్టీఆర్30 లాంచ్ కి ముంబై నుండి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన భూషణ్ కుమార్

భూషణ్ కుమార్ ఏ ఈవెంట్ కి అంత ఈజీగా రాడు. అలాంటిది ఎన్టీఆర్ మూవీ లాంచ్ కే వచ్చాడంటే ఎన్టీఆర్ తో సినిమా నిర్మించడానికి అయినా వచ్చి ఉండాలి.