మయోసైటిస్‌తో బాధపడుతూ ఇంటికే పరిమితమైన సమంత చాలా రోజులకు మీడియా ముందుకు వచ్చింది.
తన కొత్త సినిమా శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సందడి చేసింది.
శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా తన సినిమా కోసం బలం కూడగట్టుకుని మరీ ఈ కార్యక్రమానికి హాజరైంది సామ్.
చాలారోజుల తర్వాత ఆమెను చూసిన అభిమానులు పొంగిపోయారు. నెట్టింట కూడా ప్రేమ కురిపించారు.
ఇదే సమయంలో కొందరు ‘సమంతను చూస్తే జాలిగా ఉంది. ఆమె అందం బాగా తగ్గిపోయింది అంటూ ఆమె లుక్స్ గురించి నెగెటివ్ కామెంట్స్ చేశారు.
ఈ ట్రోల్స్‌కు సామ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.
‘నా లాగా కొన్ని మాసాల పాటు చికిత్స తీసుకునే పరిస్థితి మీకు రాకూడదని మీ అందం మరింత పెరిగేలా నా ప్రేమను కూడా కొంచెం పంపిస్తున్నా’ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది.
ఈక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ సామ్‌కు అండగా నిలిచారు. సదరు నెటిజన్ ట్వీట్‌కు స్పందిస్తూ ‘మీరు దేనికి బాధపడాల్సిన అవసరం లేదు.
కేవలం క్లిక్ బైట్స్ కోసమే ఆలోచిస్తారు. మీకు అందం కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫిల్టర్స్ ఉన్నాయి.
ఒక్కసారి సామ్‌ను కలవండి. తన గ్లో ఏంటో మీకే తెలుస్తుంది’ అని స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు ధావన్.