ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పలువురు బాలీవుడ్ తారలు సందడి చేసిన సంగతి తెలిసిందే.
ఐశ్వర్యారాయ్‌తో పాటు బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తళుక్కున మెరిసింది.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కొత్త డ్రెస్సులు, తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంటోంది.
అయితే ఈ వేడుకల్లో ఆమె ధరించిన క్రోకోడైల్ నెక్లెస్‌పైనే అందరి దృష్టి పడింది.
ఇంతకీ ఆమె వేసుకున్న నెక్లెస్ ధర ఎంతై ఉంటుందని నెటిజన్స్‌లో తెగ చర్చిస్తున్నారు.
దీంతో తాజాగా ఆమె టీమ్ నెక్లెస్ ధరను వెల్లడించింది.
'ఊర్వశి ధరించిన నెక్లెస్ ఫేక్ కాదు. దాని ధర రూ.276 కోట్ల వరకు ఉంటుంది. అది ఆమె ఫ్యాషన్ నిదర్శనం.' అని పేర్కొంది.
ప్రస్తుతం దీని ధర చూసి అందరూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.