ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతులకు సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే
ఈ విషయంపై గత కొంతకాలంగా వీరిపై విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే
గర్భాన్ని అద్దెకు తెచ్చుకుందని, రెడీమేడ్ బేబీని కొనుక్కుందని పలు కామెంట్లు వచ్చాయి
ఐతే ఈ విమర్శలపై ప్రియాంక తాజాగా స్పందించింది
నా కూతురు మల్తీ పుట్టగానే కొంతకాలం ఇంక్యూబేటర్‌లో ఉంచారు
నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండటం వల్లే సరోగసీని ఎంచుకున్నాం. అంతేకానీ అందం తగ్గిపోతుందనికాదు
6 నెలల పాటు వెతికితే ఓ మనసున్న మహిళ అందుకు ఒప్పుకుంది
అందుకే ఆమె పేరు కూడా వచ్చేలా నా కూతురికి మాల్తీ మారీ చోప్రా జోనాస్ అని పేరు పెట్టాం