కత్రినా కైఫ్‌.. బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఉన్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

విక్టరీ వెంకటేశ్‌ నటించిన మల్లీశ్వరి సినిమాలో ఆమె అందం, అభినయానికి టాలీవుడ్ ప్రేక్షకులు ముగ్ధులయ్యారు.

గతేడాది బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌ (Vicky Kaushal) తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

మేము మా పెళ్లిని గోప్యంగా ఉంచడానికి ప్రధాన కారణం కొవిడ్‌. అప్పటి పరిస్థితుల వల్ల అలా రహస్యంగా పెళ్లిచేసుకోవాల్సి వచ్చింది.

ఆ సమయంలో నా కుటుంబ సభ్యుల్లో చాలామంది కరనా వల్ల ఇబ్బంది పడ్డారు. అలాంటిది మా వల్ల మరొకరికి ఈ మహమ్మారి సోకకూడదనే ఉద్దేశంతోనే సీక్రెట్‌గా పెల్లి చేసుకున్నాం.

అయితే మా వివాహం మాత్రం చాలా గ్రాండ్‌గా, అందంగా జరిగిందని భావిస్తున్నాను. మేము ఇద్దరం చాలా హ్యాపీగా ఫీలయ్యాం’

అంటూ పలు విషయాలు పంచుకుంది కత్రినా..