అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్‌.

అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు గ్లామరస్‌ పాత్రలు పోషిస్తూనే మరోవైపు ఓరియంటెడ్‌ సినిమాలతోనూ మెప్పిస్తోంది.

ఒక్కో సినిమాకి నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోన్న జాన్వీ ఏడాదికి సుమారు అరడజనుకు పైగా సినిమాలలో నటిస్తోంది.

అలాగే పలు ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ చేజేతులా సంపాదిస్తోంది.

ఈనేపథ్యంలో ముంబైలోని బాంద్రాలో ఓ విలాసవంతమైన డ్యూప్లెక్స్‌ విల్లాను కొనుగోలు చేసిందట ఈ స్టార్‌ కిడ్‌.

ఇందుకోసం ఆమె ఏకంగా రూ.65 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. స్టాంప్‌ డ్యూటీ కింద మరో రూ.3.90 కోట్లు అదనంగా చెల్లించిందట.

కాగా కొత్త ఇంటిని కొనుగోలు చేసేముందే జుహులోని తన ఇంటిని నటుడు రాజ్‌కుమార్‌ రావుకు రూ.45 కోట్లకు అమ్మేసిన సంగతి తెలిసిందే.