నవాబుల నగరం నుండి వచ్చిన ఉర్ఫీ జావేద్ నటి కావాలనే కలతో మాయానగరి ముంబైకి కొత్త అందాలను పరిచయం చేస్తోంది.

ఉర్ఫీ జావేద్ నటనా ప్రపంచంలో తనకంటూ ఒక పేరు తెచ్చుకోవడానికి అనేక ప్రయత్నాల తర్వాత ఆమె ఫ్యాషన్ గేమ్ మొదలు పెట్టింది.

ఉర్ఫీ జావేద్ డ్రెస్ వేసిదంటే ముంబై నగరం మాత్రమే కాదు సోషల్ మీడియా ప్రపంచం మొత్తాన్ని తనపైకు తిప్పుకుంటోంది. 

ఇప్పుడు తన డ్రెస్సింగ్‌ విషయంలో ఇటీవల కేసులను కూడా ఎదుర్కొన్న ఉర్ఫీ జావెద్‌కు కొత్త సమస్య వచ్చి పడింది.

ఆమెకు ముంబైలో ఎవరూ ఇల్లు కిరాయికి ఇవ్వడం లేదట. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా చెప్పుకుంటూ విచారం వ్యక్తం చేసింది.

నేను వేసుకునే డ్రెస్సులు చూసి ముస్లిం ఓనర్లు ఇల్లు కిరాయికి ఇవ్వడం లేదు.

నేను ముస్లిం కాబట్టి హిందూ ఓనర్లు ఇల్లు రెంట్‌కి ఇవ్వడం లేదు.

కొంతమందేమో నాకు వస్తున్న రాజకీయ బెదిరింపులను చూసి భయపడుతున్నారు.

మొత్తానికి నాకు ముంబై నగరంలో అద్దెకు అపార్ట్‌మెంట్‌ దొరకడం చాలా కష్టంగా మారింది.అంటూ ఉర్ఫీ జావెద్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో రాసుకొచ్చింది.