ప్రతిరోజూ టీ తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత కప్పు టీ తాగుతుంటారు.
ఐతే పాలు, పంచదార కలిపిన సాధారణ టీ కాకుండా.. బ్లాక్ టీ తాగితే..
బ్లాక్ టీతో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. ఈ టీని రెగ్యులర్గా తాగితే ఆయుష్షు కూడా పెరుగుతుందట.
బ్లాక్ టీ తాగే వ్యక్తుల మరణ అవకాశాలు.. బ్లాక్ టీ తాగని వ్యక్తి కంటే 13% తక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.
దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసేందుకు బ్లాక్ టీ ఒక ఆరోగ్యకరమైన అలవాటు అని వైద్యులు కూడా చెబుతున్నారు
బ్లాక్ టీ ప్లాంట్లో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే రసాయనాలు కనిపిస్తాయి. ఇవి మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడతాయి
బ్లాక్ టీలో కాటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇది కణాల ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాదు మన శరీరంలో వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది.
బ్లాక్లో లాభాలు మాత్రమే కాదు. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.
బ్లాక్ టీలో కెఫిన్ ఉంటుంది. ఎక్కువగా కెఫీన్ తాగడం వల్ల ఆందోళన, ఒత్తిడి, వేగవంతమైన హృదయ స్పందన రేటు, నిద్రలేమి, తలనొప్పి, జీర్ణ సమస్యలు ఏర్పడవచ్చు