మన దేశంలో పిల్లి ఎదురురావడం అశుభంగా పరిగణిస్తారు
అందులోనూ నల్ల పిల్లి ఎదురువచ్చిందంటే చాలా ఇక అంతే.. కాసేపు ఆగి మళ్లీ ప్రయాణాన్ని కొనసాగిస్తారు
కొన్ని దేశాల్లో ప్రసిద్ధ సంస్కృతులలో నల్ల పిల్లులను శుభప్రదంగా పరిగణిస్తారు
కొత్తగా పెళ్లయిన వారి ఇంట్లో నల్ల పిల్లి ఉంటే అది చెడును దూరం చేస్తుందని యూకే జనం నమ్ముతారు
నలుపు లేదా స్వచ్ఛమైన తెల్లని పిల్లులు తమ ఇళ్లకు వస్తే శ్రేయస్సు , అదృష్టాన్ని తెస్తాయని జపాన్ వాసులు నమ్ముతారు
ఫ్రాన్స్‌లోని నమ్మకాల ప్రకారం.. అక్కడివారు నల్ల పిల్లికి సరిగ్గా ఆహారం ఇస్తే ఆ రోజు అద్భుతమైన అదృష్టం కలిసి వస్తుందని అనుకుంటారు
నలుపు లేదా ఏదైనా రంగు పిల్లి కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే సంపద త్వరలో తలుపు తడుతుందని స్కాటిష్‌ల భారీ నమ్మకం
ఈజిప్టులో నల్ల పిల్లులను దేవతలుగా పూజిస్తారు. వాటిని మనోహరంగా ఆప్యాయతతో తెలివైనవిగా నమ్ముతారు