పొడవైన గోర్లు పూణేకు చెందిన శ్రీధర్‌ చిల్లాల్‌ అనే వ్యక్తి 66 ఏళ్లుగా గోర్లు కట్‌ చేయకుండా పెంచుతున్నారు.

ఈజీగా నమిలేస్తాడు.. ముంబైకి చెందిన దినేష్ శివనాథ్ ఉపాధ్యాయ కెచప్ బాటిల్‌ను అత్యంత వేగంగా తాగి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

ముక్కుతో టైప్‌ చేయడం న్యూఢిల్లీకి చెందిన దవీందర్‌ సింగ్‌ తన ముక్కును ఉపయోగించి మొత్తం వాక్యాలను సెకన్ల వ్యవధిలో టైప్‌ చేయగలడు. ఆ రికార్డును కలిగి ఉన్నాడు.

పొడవైన చెవి వెంట్రుకలు ఆంథోనీ విక్టర్‌ పొడవాటి చెవి వెంట్రుకలు కలిగిన వ్యక్తిగా రికార్డుకెక్కారు. అతడి చెవి వెంట్రుకల పొడవు 7.12 అంగుళాలు

పాట పాడి రికార్డు నాగ్‌పూర్‌కు చెందిన సునీల్‌ వాగ్మారే ఐదు రోజుల పాటు 105 గంటల పాటు నిరంతరంగా పాట పాడినందుకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు.

పొడవైన మీసం జైపూర్‌కు చెందిన రామ్‌సింగ్‌ చౌహాన్‌14 అడుగుల పొడవైన మీసాలు కలిగిన వ్యక్తిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు.

నిప్పు మీద నడుస్తూ.. ముంబైలో జరిగిన ఓ కంపెనీ ఈవెంట్‌లో 1356 మంది వరుసగా నిప్పులపై నడుస్తూ 2017లో రికార్డు సృష్టించారు.

పొడవాటి జుట్టు 5 అడుగుల 7 అంగుళాల పొడవైన తల వెంట్రుకలతో నీలాన్షి పటేల్‌ అనే యువతి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించింది.