నందమూరి క‌ల్యాణ్‌రామ్  టైటిల్‌ రోల్‌లో న‌టించిన చిత్రం బింబిసార.

ఫాంట‌సీ డ్రామా నేప‌థ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వ‌శిష్ఠ దర్శకత్వం వహించాడు.

ఈ చిత్రంలో క‌ల్యాణ్ రామ్ బింబిసార చ‌క్రవర్తిగా, దేవ‌ద‌త్తుడిగా రెండు పాత్రల్లో నటించాడు.

బింబిసార ఇటీవలే జీతెలుగులో తొలిసారి ప్రసారమైంది.

తాజా అప్‌డేట్ ప్రకారం బింబిసార 11.5 టీఆర్‌పీ రేటింగ్‌ నమోదు చేసింది.

ఇటీవల కాలంలో సినిమాలు థియేటర్లలో సక్సెస్‌ అయినప్పటికీ ఏ సినిమా కూడా ఈ స్థాయిలో టీఆర్‌పీ రేటింగ్‌ సాధించకపోవడం గమనార్హం.

బింబిసార సిల్వర్ స్క్రీన్‌పై మూవీ లవర్స్‌ ను ఆకట్టుకోవడమే కాకుండా టీవీ ప్రేక్షకులను కూడా ఫిదా చేస్తూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.