బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో ఒక్కసారిగా తెలుగు వారిని ఆకర్షించి , క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించిన అందాల ముద్దుగుమ్మ దివి..

హౌజ్‌లో తనదైన చలాకీ తనం, అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తెలుగువారందరికీ సుపరితురాలైంది. ఈ షోలోనే చిరంజీవి సినిమాలో నటించే లక్కీ ఛాన్స్‌ను కొట్టేసింది.

చిరు హీరోగా ఇటీవల వచ్చిన ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రంలో దివి నటించిన విషయం తెలిసిందే.

ఇక సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుందీ బ్యూటీ. ఎప్పటికప్పుడు సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను పంచుకునే ఈ బ్యూటీ.

మోడల్‌గా కెరీర్‌ మొదలు పెట్టి యాక్టర్‌గా ఎదిగే క్రమంలో మీకు ఎప్పుడైనా కాస్టింగ్ కౌచ్‌ వంటి చేదు అనుభవం ఎదురైందా అన్న ప్రశ్నకు దివి సమాధానం ఇచ్చింది.

ఇప్పటి వరకు నాకు అలాంటి అనుభవం ఎదురుకాలేదు. మోడలింగ్, షార్ట్ ఫిలిమ్స్.. ఇలా నాకు వచ్చిన అవకాశాలను చేస్తూ వచ్చాను. అందుకే నాకు కాస్టింగ్ కౌచ్‌ సమస్య ఎదురుకాలేదు

మన ప్రవర్తన బట్టి ఎదుటివారు ప్రవర్తిస్తుంటారు. వారెవరికీ నా గురించి కానీ, నాతో మాట్లాడే ఛాన్స్ నేను ఇవ్వలేదు. అయితే..

ఒక అమ్మాయి, అబ్బాయి ఇష్టపడి కమిట్‌ అవ్వడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. నాకు తెలిసి ఇప్పుడు ఎక్కువగా అదే జరుగుతోంది’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.