క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించిన అందాల ముద్దుగుమ్మ దివి
బిగ్‌బాస్ రియాలిటీ షోతో ఒక్కసారిగా తెలుగు వారిని ఆకర్షించింది
తనదైన చలాకీ తనం, అందమైన కళ్లతో కట్టిపడేసిన ఈ చిన్నది
అనతి కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది
ఈ షోలోనే చిరంజీవి సినిమాలో నటించే లక్కీ ఛాన్స్‌ను కొట్టేసింది
చిరు హీరోగా ఇటీవల వచ్చిన ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో దివి నటించిన విషయం తెలిసిందే
ఇందులో రేణుక పాత్రలో నటించిన దివి తొలిసారి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించింది
ఇక సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుందీ బ్యూటీ