పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఖుషి మూవీ ఎప్పుడూ స్పెషల్

ఈ సినిమాలో పవన్, భూమిక చావ్లా జోడీ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది

యువకుడు సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగు పెట్టిన భూమిక.. ఖుషి సినిమాతో కుర్రకారికి కలల సుందరిగా మారిపోయింది

అప్పట్లో భూమికని ప్రేమించని యువకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు

ఆ సినిమాలో సాంగ్స్ ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి.  ఇక భూమిక నడుమ సీన్ బోలెడంత పాపులర్ అయింది

తాజాగా భూమిక అమ్మాయే సన్నగా అంటూ మళ్ళీ ఆ పాటకు డ్యాన్స్ చేసింది

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది

ఖుషి సినిమాతో హిట్ అందుకున్న ఈ సుందరి.. మహేష్ బాబు తో ఒక్కడు, ఎన్టీఆర్ తో సింహాద్రి వంటి బాక్సాఫీస్ హిట్స్ సినిమాల్లో నటించింది