సౌత్ సినిమాల్లోనే కాకుండా బాలీవుడ్‌లో మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు పొందింది భూమిక.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమెమాట్లాడుతూ.. 'హిందీలో నా తొలి చిత్రం తేరే నామ్. ఇందులో సల్మాన్ ఖాన్ సరసన నటించాను.
ఈ మూవీ హిట్ కావడంతో నాకు హీరోయిన్‌గా మంచి మంచి అవకాశాలు వచ్చాయి. సాధారణంగానే నేను ఆచితూచి సినిమాలు ఒప్పుకుంటాను.
అలా తేరే నామ్ తర్వాత నాకు ఒక పెద్ద సినిమా ఆఫర్ వచ్చింది. ఓకే చేశా. కానీ సడన్‌గా నిర్మాతలు మారడంతో హీరోను, నన్ను మార్చేశారు.
ఒకవేళ ఆ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేదేమో! ఏది జరగాలనుంటే అది జరుగుతుందనుకున్నాను.
కానీ ఆ సినిమా కోసం మరే మూవీ ఒప్పుకోకుండా ఏడాదిపాటు ఎదురుచూశాను. చివరికి నిరాశే ఎదురవడంతో వేరే సినిమాలకు సైన్ చేశాను.
కానీ తేరే నామ్ వంటి పెద్ద హిట్ నాకు బాలీవుడ్‌లో మళ్లీ దొరకలేదు. నాకు మరీ బాధేసిన సంఘటన ఏంటంటే.. జబ్ వి మెట్ సినిమాకు మొదట నేను సంతకం చేశాను.
నాకు జోడీగా బాబీ డియోల్ అన్నారు, తర్వాత షాహిద్ కపూర్ అన్నారు. కట్ చేస్తే షాహిద్ కపూర్- కరీనా కపూర్ సినిమాలో ఉన్నారు. నన్ను తీసేశారు.
మున్నా భాయ్ ఎంబీబీఎస్ సినిమాకు కూడా సంతకం చేశాను, కానీ ఇక్కడ కూడా నన్ను తీసేశారు.
మణిరత్నం కన్నతిల్ ముత్తమిట్టల్ సినిమాలో కూడా నేనే హీరోయిన్ అని చెప్పి చివరకు హ్యాండిచ్చారు' అని తెలిపింది.