చిరంజీవి హీరోగా మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం  ‘భోళా శంకర్‌’.

ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా నటిస్తుంది.

చిరు చెల్లిగా కీర్తి సురేష్‌ కనిపించనున్నా ఈ చిత్రంలో హీరో సుశాంత్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

చిరు చెల్లిగా కీర్తి సురేష్‌ కనిపించనున్నా ఈ చిత్రంలో హీరో సుశాంత్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ మేరకు ఈ నెల 4న ‘భోళా మానియా’ పేరుతో ఫస్ట్ సాంగ్ విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్.

ఈ విషయాన్ని తెలుపుతూ శుక్రవారం ఓ ప్రోమోను కూడా విడుదల చేశారు.

ఆ ప్రోమోలో ఓ చేత్తో కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకుంటూ.. మరో చేత్తో త్రిశూలం లాకెట్‌ ఉన్న కీచైన్‌ను తిప్పుతూ స్టైలిష్‌ లుక్‌లో కనిపించారు చిరు.

‘‘భావోద్వేగాలతో నిండిన కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది.

ఈ నెలాఖరు నాటికి చిత్రీకరణ పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అని తెలిపాయి చిత్ర వర్గాలు.