ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు చిరంజీవి

ఇప్పుడు ‘భోళా శంకర్‌’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు చిరు

మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ  చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు

ఈ మూవీలో చిరు చెల్లిగా కీర్తి సురేష్‌ కనిపించనున్న విషయం తెలిసిందే

ప్రస్తుతం వీరిద్దరిపై హైదరాబాద్‌ కోఠి ఉమెన్స్‌ కాలేజీలో కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నట్లు తెలిసింది

చిరు-కీర్తిలపై షూట్‌ చేస్తున్న ఈ ఎపిసోడ్స్‌ సినిమాకెంతో కీలకంగా నిలుస్తాయని చెబుతున్నారు మూవీ మేకర్స్

అన్నాచెల్లి అనుబంధాల నేపథ్యంలో సాగే మాస్‌ యాక్షన్‌ మూవీగా ఈ చిత్రం రూపొందుతుంది

చిరుకు జోడీగా తమన్నా నటిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వరసాగర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు