తమలపాకులకు మన దేశంలో ప్రత్యేకమైన స్థానం ఉంది.. దేవుడి ఆరాధనలో ఉపయోగించడంతోపాటు, చాలా మంది ఇష్టంతో తింటారు.

తమలపాకులతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు దాగున్నాయి. ఇందులోని పోషకాలు పలు సమస్యలకు చెక్ పెడతాయి

తమలపాకులను నమలడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది

దంతాల ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు చిగుళ్లలో వాపు లేదా గడ్డ వంటి సమస్యలు నమమవుతాయి

మధుమేహం అదుపులో ఉంటుంది.. తమలపాకులను తీసుకోవడం ద్వారా శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.

తమలపాకులను నమలడం వలన జలుబు, అలర్జీ, తలనొప్పి, వాపు, శరీరంలోని ఏదైనా భాగంలో గాయం వంటి సాధారణ సమస్యలు దూరమవుతాయి.

తమలపాకులో తేనె, మిరియాలు కలిపి తింటే బరువు కూడా తగ్గవచ్చు..