చలి పంజా విసురుతోంది. దాంతో శారీరకంగానూ కాస్త బద్ధకం, ఇంకొంత నీరసం ఆవహించి... పని వేగం మందగిస్తుంది.
అలా కాకుండా చురుగ్గా ఉండాలంటే ఏం తినాలో సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు.
తృణధాన్యాలు: వీటిలోని మాంసకృత్తులూ, పీచు మెటబాలిజం రేటుని మెరుగు పరుస్తాయి. తక్షణ శక్తిని అందిస్తాయి
గింజలు: నట్స్ లేదా సీడ్స్‌ని స్నాక్స్‌లా తీసుకోండి. ఇవి అలసటను రానీయవు.
ఓట్స్: కొవ్వుని కరిగించడంలో, శరీరంలో ఇన్సులిన్ స్థాయులు తగ్గకుండానూ ఇందులోని పోషకాలు సాయపడతాయి. ఫలితంగా రోజంతా శక్తిని కోల్పోకుండా ఉంటారు.
చియా సీడ్స్: పోషకాలు నిండుగా ఉండే వీటిల్లో కార్బోహైడ్రేట్‌లూ ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులూ, ఫైబర్ రోజంతా శక్తినిస్తాయి.
పాలకూర: ఇందులో ఐరన్‌తోపాటు విటమిన్ సి, ఫోలేట్ ఎక్కువగా ఉంటాయి.
గుడ్లు: రుచే కాదు... ప్రొటీన్ ఎక్కువగా దొరికే ఆహారం గుడ్లు. కోల్పోయిన శక్తిని పుంజుకునేలా చేస్తాయి
పండ్ల్లు, కూరగాయలు: ఇవి అవసరమైన పోషకాలు అందించి ఆరోగ్యంగా మారుస్తాయి.