ఆంధ్ర ఊటీగా పిలవబడే ఈ అరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీత రామరాజు జిల్లలో ఉంది
అరకు వైజాగ్ నుంచి దాదాపుగా 120 కిలోమీటర్ల దూరంలో ఉంది
అయితే హైదరాబాద్ నుంచి అరకు ఎలా చేరుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం
దీనికోసం మీరు ముందుగా బస్సు, ట్రైన్ లేదా ఫ్లైట్ ద్వారా వైజాగ్ వెళ్ళాలి
అక్కడి నుంచి అరకు వెళ్ళడానికి ఆర్టీసి కాంప్లెక్స్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి బస్సులో అరకు చేరుకోవచ్చు
మీరు ఫ్లైట్ లో వైజాగ్ వెళ్లినట్టయితే ఎయిర్ పోర్ట్ నుంచి ఎన్ఏడీ జంక్షన్ చేరుకోవాలి
ఎన్ఏడీ జంక్షన్ నుంచి ఆర్టీసి బస్సు ద్వారా అరకు చేరుకోవచ్చు
అంతేకాదు వైజాగ్ నుంచి ఉదయం 6:45కి , రాత్రి 9:20కి రెండు ట్రైన్లు కూడా నడుస్తున్నాయి