ప్రతి మనిషికి రకరకాల భావోద్వేగాలు ఉంటాయి. వాటిల్లో కోపం ఒకటి. ఈ కోపం మనిషిని రాక్షసుడిలా మారుస్తుంది.

కోపం అనేది ఒక సాధారణ ప్రతిచర్య, భావోద్వేగం. అయితే, ఆ కోపం అనేది మితిమీరితేనే అనేక అనర్థాలకు దారితీస్తుంది.

మరి కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఇందుకోసం ఉన్న మార్గాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఒక వ్యక్తికి నిర్దిష్ట పరిస్థితి కారణంగా కోపం వస్తుంటుంది.

మీరు కోపంగా ఉన్నట్లయితే.. ఎలా అనుభూతి చెందుతున్నారు? సరిగ్గా తిన్నారా? రాత్రి బాగా నిద్రపోయారా? ఈ విషయాలన్నీ విశ్లేషించుకోవాలి.

ఇలా మీ కోపాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి.

కోపంలో ఆలోచనలను నియంత్రించలేరు. ఇది పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది.

అందుకే కోపం వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు సానుకూలంగా ఆలోచించడం చాలా ముఖ్యం. సానుకూల ఆలోచనలను పెంపొందించుకోవాలి.

మీతో ఓ పాకెట్ డైరీని ఉంచుకోవాడం ద్వారా ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఆ డైరీని చదవడం, రాయడం చేస్తే కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.