చాలామంది గురక సమస్యతో బాధపడుతుంటారు. గురక అనేది కూడా ఒక అనారోగ్య సమస్యే.. పలు అంతర్గత సమస్యల వల్ల వస్తుంది
గొంతులోని శ్వాసకు సంబంధించిన కండరాల బలహీనత, ముక్కులో అడ్డంకులు, అత్యధిక బరువు లాంటి సమస్యలతో గురక వస్తుంది
గురక పెట్టే వారి వల్ల పక్కనున్నవారు.. సరిగా నిద్రపోలేరు. పోనుపోను చాలా ఇబ్బందులు వస్తాయి. దీనికి కొన్ని చిట్కాలు పాటిస్తే చెక్ పెట్టవచ్చు
బరువును అదుపులో ఉంచుకోవాలి. ఆల్కహాల్ తీసుకోకూడదు. ఎక్కువగా తినకుండా ఉండాలి.
నిద్రకూ - భోజనానికి మధ్య మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. తగినంతగా నిద్రపోవాలి, స్లీపింగ్ పిల్స్ వంటివి వాడకూడదు..
నిద్రవేళలు క్రమబద్ధంగా ఉండాలి. వెల్లికిల పడుకోవడానికి బదులుగా ఒకవైపునకు తిరిగి పడుకోండి.
తలను.. పడకకంటే నాలుగు అంగుళాల ఎత్తుగా ఉండేలా తలగడను సెట్ చేసుకోవాలి.. ఇలా చేస్తే గురక సమస్యను అధిగమించవచ్చు