ఒత్తిడి వల్ల కూడా మొటిమలు వస్తుంటాయి. అందుకే బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ సరైన నిద్ర ఉంటే మొటిమలు దరిచేరవు.

ముఖంమీద మొటిమలు ఎర్రగా తయారై మంటగా ఉంటే వాటిపై ఐస్ క్యూబ్ బాగా పనిచేస్తాయి. మొటిమలకు చక్కని ఉపశమనాన్ని ఇస్తాయి.

టీ ట్రీ ఆయిల్‌ను నిత్యం మొటిమ‌లపై రాస్తుంటే దాంతో కొద్ది రోజుల్లో మొటిమ‌లు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.

యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌కు 3 భాగాల నీరు క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. దీన్ని రాత్రి పూట ప‌డుకునే ముందు మొటిమ‌ల‌పై అప్లై చేయాలి. ఉదయాన్నే కడిగేయాలి

రెండు టేబుల్ స్పూన్ల తేనె, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకుని రెండింటినీ బాగా కలిపి మిశ్రమాన్ని ముఖానికి ప‌ట్టించి 10-15 నిమిషాలు ఆగాక కడిగేయాలి.

అర‌టి పండు తొక్కను తీసుకున దాని లోప‌లి భాగాన్ని ముఖంపై మ‌సాజ్ చేసి 30 నిమిషాల తరువాత ముఖాన్ని క‌డిగేయాలి.

ముఖము రెండుపూటలా సబ్బుతో కడుగుకోవాలి.

జిడ్డుముఖమైతే నూనె, కొవ్వు పదార్దములు తినడము తగ్గించాలి. ప్రతిరోజూ వ్యాయామము చేయాలి.

దాల్చిన చెక్కను పేస్ట్‌లా చేసి మొటిమలపై రాసి కాసేపాగి కడిగేయండి.