పాదాల పగుళ్లకు ఈ హోమ్ రెమిడీస్ వల్ల చక్కటి ఫలితం కనిపిస్తుంది.
బాగా పండిన అరటి పండు గుజ్జును పగుళ్ల మధ్యలో రాసుకుంటే ప్రతిఫలం కనిపిస్తుంది
వెన్నను పగుళ్ల మధ్యలో నిదానంగా రాసి కొంత సమయం వరకు ఉంచితే నొప్పులు తగ్గుతాయి.
తేనెలో నిమ్మరసం కలిపి పగిలిన కాళ్లకు రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది
పగుళ్లు వచ్చిన చోట ఎలాంటి మట్టి, మురికి లేకుండా శుభ్రం చేసి కొద్దిగా పసుపులో నూనె కలిపి మసాజ్ చేస్తే కాళ్లు మృదువుగా మారి..నొప్పులు తగ్గుతాయి.
పగుళ్లు తగ్గడానికి వేప ఆకులతో చేసిన పేస్ట్‌కు కాస్త పసుపు కలిపి అప్లై చేయాలి. ర్వాత నూనెతో తుడిచి మర్దన చేస్తే పగుళ్లు నయం అవుతాయి.
పగిలిన చోట శుభ్రం చేసుకొని మురికి లేకుండా తుడిచి అక్కడ గోరింటాకు పేస్ట్‌ని అప్లై చేస్తే పాదాల పగుళ్లకు సులువుగా చెక్ పెట్టవచ్చు.
శనగ నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్, కొబ్బరి నూనె,నువ్వుల నూనె వంటి వాటిని రాత్రి పడుకోబోయే ముందు పాదాలకు మర్ధన చేస్తే తెల్లవారు జామున రిలీఫ్‌గా ఉంటుంది.