శీతాకాలంలో మెంతి కూర మార్కెట్‌లో చాలా తాజాగా,ఎక్కువగా లభిస్తుంది.

మెంతికూరతో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. మెంతులు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. 

మెంతికూరను తినడం వల్ల కొన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

చెడు కొలెస్ట్రాల్ సమస్య నుంచి బయట పడేందుకు మెంతి ఆకులు ప్రయోజనకరంగా ఉంటాయి.

బరువు తగ్గాలని ఆలోచిస్తున్నవారు తమ ఆహారంలో మెంతి ఆకులను చేర్చుకోవచ్చు. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది

మెంతి ఆకులకు బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేసే శక్తి ఉంది. మధుమేహం సమస్య ఉన్నవారు ఆహారంలో మెంతికూరను చేర్చుకోవాలి.

మెంతి ఆకులను నమలడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇంకా అనేక కడుపు సంబంధిత సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.