కొవ్వును పొగొట్టుకోవడానికి ఈ పండ్లను రెగ్యులర్‌గా తినడం మంచిది.
యాపిల్స్‌లో క్యాలరీలు తక్కువగా.. ఫైబర్ అధికంగా ఉంటుంది. బరువు తగ్గాలంటే రోజుకు ఒక యాపిల్ తినండి
కివీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యం కోసం తగినంత ఫైబర్, తక్కువ కేలరీల పండ్లను తినండి.
నారింజలో పీచుతో పాటు విటమిన్ ఎ, సి కూడా ఉంటాయి. స్నాక్స్ సమయంలో ఈ పండ్లను తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.
కర్బూజలో నీరు పుష్కలంగా ఉంటుంది. దీనిలో తక్కువ కేలరీలను ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి, శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.
బెర్రీలో తగినంత మొత్తంలో విటమిన్లు ఉంటాయి. కొలెస్ట్రాల్, రక్తపోటు, నొప్పి నుంచి ఉపశమనం కోసం మీరు ప్రతిరోజూ తినవచ్చు.
అరటిపండులో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడానికి ఇది సరైన పండు.