క్యాన్సర్ వ్యాధికి చెక్ పెట్టే ఆ ఆహారాలేంటో చూద్దాం

ట‌మాటాలు త‌దిత‌ర ఆహార ప‌దార్థాల‌ను నిత్యం తీసుకుంటే క్యాన్సర్ రాకుండా అడ్డుకోవ‌చ్చు.

బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ బెర్రీలను నిత్యం తింటూ ఉంటే.. అవి క్యాన్సర్ క‌ణాల‌తో పోరాడి, వాటిని నాశ‌నం చేస్తాయి.

ప్రతిరోజూ రెండు కన్నా ఎక్కువ సార్లు సిట్రస్‌ పండుగానీ, జ్యూస్‌ గానీ తీసుకున్నవాళ్లలో 'చర్మ క్యాన్సర్‌' వచ్చే అవకాశాలు 36 శాతం తక్కువగా ఉంటుంది. 

వెల్లుల్లిలో 'అలిసిన్' అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది క్యాన్సర్ క‌ణాల‌ను నాశ‌నం చేస్తుంది. 

బ్రేక్‌ఫాస్ట్‌లో కొద్దిగా అల్లం ఉండేలా చూసుకుంటే క్యాన్సర్ రాకుండా చూసుకోవ‌చ్చు.

పెద్దపేగు క్యాన్సర్‌కు కారణమయ్యే కణాల నుండి ఆలివ్ ఆయిల్ రక్షణ కల్పించి క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. 

నిత్యం రెండు గ్లాసులు పాలు తాగితే క్యాన్సర్ నుంచి కొంతలో కొంతైనా ఉపశమనం పొందొచ్చంటున్నారు నిపుణులు.

ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌ అవిసె గింజలలో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాన్సర్ కణాలతో పోరాడగలిగే శక్తి చేపలు తినడం వల్ల లభ్యమవుతుంది.

క్యారెట్లను తరచుగా తింటూ ఉంటే.. క్యాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చు.