అరటిపండ్లు: హై బీపీ పేషెంట్లకు అరటిపండ్లు ఎంతో మేలు చేస్తాయి.

ఆకు కూరలు: ఆకుకూరల్లో ఉండే పోషకాలు అధిక రక్తపోటును నియంత్రించడానికి ఎంతో సహాయపడతాయి.

టమాటాలు: టమోటా జ్యూస్ తాగడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

దానిమ్మ పండ్లు: యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే దానిమ్మ బీపీని నియంత్రించి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బీట్ రూట్: బీట్ రూట్ లో నైట్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త నాళాలను సడలించడానికి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

అవొకాడో: అవొకాడోల్లో పొటాషియం, ఫోలేట్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి సహాయపడతాయి.

వెల్లుల్లి: వెల్లుల్లి రక్త నాళాలను విస్తరించే నైట్రిక్ ఆక్సైడ్ మొత్తాన్ని పెంచడానికి సహాయపడుతుంది.

అల్లం: మీ రోజువారీ ఆహారంలో అల్లాన్ని చేర్చడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదం కూడా తప్పుతుంది. 

సాల్మన్ ఫిస్: ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్న సాల్మన్ ఫిష్ అధిక రక్తపోటు పేషెంట్లకు ఎంతో సహాయపడుతుంది. 

బెర్రీలు: యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే బెర్రీలు అధిక రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడతాయి.