స్థూలకాయంతో శరీర బరువు మొత్తం మోకాళ్లపై పడడంతో మోకాళ్ళ నొప్పులు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయి.
ఇంకా చెప్పాలంటే అనేక కారణాలతో మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి.
మోకాలు నొప్పులు రాకుండా ఉండాలంటే మనం తినే ఆహారంలో సరైన పోషక విలువలు ఉండడంతో పాటు సరైన వ్యాయామం అవసరం.
డ్రైఫ్రూట్స్..నట్స్‌లో విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నందున ఆరోగ్య నిపుణులు తరచుగా వాటిని తినమని సిఫార్సు చేస్తారు.
ఇది ఎముకలను బలపరుస్తుంది. అందుకే నట్స్ తినడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.
అల్లం, పసుపు..అల్లం, పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.
అల్లం, పసుపు కలిపి కషాయం చేసి తాగినా మంచి ఫలితం ఉంటుంది.
పండ్లు..శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే పండ్లను తినడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. వీటిలో నారింజ, స్ట్రాబెర్రీ, చెర్రీస్ ఉన్నాయి.