నానాటికీ డయాబెటిస్ బాధితులు పెరుగుతున్నారు

ఈ క్రమంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని.. డైట్‌లో పలు పదార్థాలను చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు

అలాంటి డయాబెటిస్ కంట్రోల్ పదార్థాల్లో ఒకటి గోధుమ గడ్డి జ్యూస్

ఇది మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులతో ఉపశమనాన్ని కలిగించడమే కాకుండా.. అధిక బరువును కూడా నియంత్రిస్తుంది

గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది

గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల స్థూలకాయం తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి

గోధుమ గడ్డి రసం తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచదు

గోధుమ గడ్డి రసంలో క్లోరోఫిల్ పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగా శరీరంలోని టాక్సిన్స్ బయటకు వస్తాయి