సాధారణంగా చాలామంది అక్షంతలు ఇంట్లో అంతగా ఉపయోగించరు.
ఎప్పుడైనా శుభకార్యాలు చేసుకునేటప్పుడు లేదా పెళ్లి సమయాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.
శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎల్లప్పుడూ అక్షంతలు ఉండాలని పండితులు చెప్తున్నారు.
ఎందుకంటే.. అక్షంతలు శుభాన్ని సూచిస్తాయి కనుక వాటిని ఇంట్లో ఉంచుకుంటే..
అఫ్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు చేకూరుతాయని నమ్మకం.
పూజలో ఉపయోగించిన అక్షంతలని ఒకచోట దాచుకుని ప్రయాణానికి వెళ్లే వేళ..
ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లేటప్పుడు తలపై వేసుకుని బయల్దేరాలి.
ఇలా చేస్తే మీరు తలపెట్టిన లేదా చేయాలనుకున్న కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తిచేస్తారు.