వేసవిలో పుచ్చకాయను తినడం వలన శరీరాన్ని హైడ్రేట్‌గా, అలసిపోకుండా ఉండడమే కాకుండా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది
కేవలం పుచ్చకాయ మాత్రమే కాదు.. అందులోని గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి
ఆరోగ్య నిపుణుల అభిప్రాయాల ప్రకారం.. పుచ్చకాయ గింజలలో అనేక రకాల పోషకాలున్నాయి. వీటిని తినడం వలన ఆరోగ్యానికి ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి
4 గ్రాముల విత్తనాలలో దాదాపు 0.29 మి.గ్రా ఏరియన్, 21 మి.గ్రా మెగ్నీషియం, పాలీఅన్‌శాచురేటెడ్, మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి
పుచ్చకాయ గింజలు తక్కువ కేలరీల ఆహారం కావడంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచిది. ఊబకాయాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా అనేక సమస్యలు తగ్గుతాయి
ఇది జీవక్రియ పిండి పదార్థాలను సమర్ధవంతంగా నియంత్రించడం ద్వారా టైప్-2 డయాబెటిస్‌లో సహాయపడుతుంది
పుచ్చకాయ గింజలు స్కిన్ టోన్‌ని మెరుగుపరచడమే కాకుండా వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది
పుచ్చకాయ గింజల నుండి తీసిన నూనెను అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తారు