రోజంతా విపరీతంగా కష్టపడటం ద్వారా అలసిపోతుంటారు. అలా తీవ్ర అలసటతో ఇంటికి వచ్చి మెత్తటి బెడ్‌పై పడుకుంటే ఒక రకమైన హాయి కలుగుతుంది
ఈ విషయంలో అస్సలు రాజీపడరు. ఇంకా ప్రజలు తమ సౌకర్యానికి అనుగుణంగా పడకలను సిద్ధం చేసుకుంటారు
బెడ్, పరుపుపై పడుకోవడం కంటే.. నేలపై పడుకోవడం ద్వారానే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం
నేలపై పడుకోవడం వలన వెన్నెముకకు బలం చేకూరి.. సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నేలపై నిద్రించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కండరాలలో నొప్పి కూడా తగ్గుతుంది
ఒత్తిడి తగ్గి, మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే నేలపై పడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు
నేలపై పడుకోవడం వలన హాయిగా నిద్రపడుతుందని చెబుతున్నారు