ఓట్‌ మిల్క్‌లో శరీరానికి అవసరమైన ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

ఈ పాలల్లో కొవ్వులు, క్యాలరీలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. ఈజీగా బరువు తగ్గుతారు.

ఇందులోని బీటా గ్లూకాన్‌ అనే ఫైబర్‌ జీవక్రియ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఓట్‌ మిల్క్‌లోని విటమిన్‌-బి, ఫోలేట్, ఇతర పోషకాలు ఎర్ర రక్తకణాల పనితీరును మెరుగుపరుస్తాయి.

ఓట్‌ మిల్క్‌లో విటమిన్‌-ఎ, డి, క్యాల్షియం, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం, జింక్‌ పుష్కలంగా ఉంటాయి.

ఓట్‌ మిల్క్‌లోని బీటా గ్లూకాన్‌ రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. మధుమేహ రోగులకు ఇది మంచిది.

ఓట్‌ మిల్క్‌ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ స్థాయులను పెంచుతుంది.

ఓట్‌ మిల్క్‌ వల్ల చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. జుట్టు పలచబడకుండా, తెల్లబడకుండా నిరోధిస్తుంది.