మట్టిలో తామర పువ్వు వికసిస్తుంది. దీని అందం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది

ఈ పువ్వు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని అతి తక్కువమందికి మాత్రమే తెలుసు

ఈ రోజు తామర పువ్వు ఏయే ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి సహాయపడుతుంది.. ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం

ఈ పువ్వుని చైనా సాంప్రదాయ వైద్యంలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తారు

శరీరంలో ఎక్కడైనా నొప్పి కలిగి ఉంటే.. తామర నూనెతో మసాజ్ చేయవచ్చు. ఎముకల నొప్పిని కూడా తగ్గిస్తుంది

తామరపువ్వులోని చల్లదనం మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రత, రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది

రోజూ తామరపువ్వుని ఉపయోగిస్తుంటే.. ఫీల్-గుడ్ హార్మోన్లు కూడా పెరుగుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి

తామరపువ్వుతో తయారుచేసిన నూనెను రోజూ తలకు మర్దన చేయండి. దీనివలన జుట్టు ఆరోగ్యంగా మెరుస్తూ, దృఢంగా పెరుగుతుంది