బెండకాయల్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి

వీటిని ఆహారంలో చేర్చుకుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి

ఇవి శరీరానికి అవసరమైన ప్రొటీన్లను, విటమిన్లను అందిస్తాయి. పలు వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి

ఇందులోని యాంటీ-ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ప్రభావం నుంచి కణాలను రక్షిస్తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి

ఇందులో కేలరీలు ఉండవు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఆహారం

ఇందులోని ఫొలెట్‌, విటమిన్ B9 రెండూ మన మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పెక్టిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతాయి

వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. బాడీ డీహైడ్రేట్‌ కాకుండా కాపాడతాయి