పనస పండు ఉపయోగాలు  తెలిస్తే షాకే

Phani CH

30 AUG 2024

వేసవి సీజన్‌లో మామిడి పండ్లు, ముంజకాయలు, పనస పండ్లు దర్శనమిస్తాయి.  అయితే వీటిలో ఆరోగ్యపరంగా పనస పండు  చేసే మేలు అంతాఇంతా కాదు.

పనస పండు తినడం వలన శరీరానికి ఇన్సులిన్ అందించిన దానితో సమానం అవుతుంది. ఇది శరీరంలోని గ్లూకోజ్ లెవల్ పెరిగేలా చేస్తుంది

పనస పండులో వుండే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. అంతే కాదు రేచీకటి సమస్యను కూడా తగ్గిస్తుంది.

పనస చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి పనసపండు తింటే మంచి ఫలితాన్నిస్తుంది.

దీనిలో ఉన్న క్యాల్షియం శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది. అంతే కాదు ఫైటోన్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి.

పనసలో ఉండే ఫైబర్ జీవక్రియలను సాఫీగా జరిగేలా చేసి కడుపులో ఏర్పడే గ్యాస్, అల్సర్ వంటి జీర్ణ వ్యాధులను నివారిస్తుంది.

పనసపండు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది సీజనల్ ఇన్‌ఫెక్షన్స్ సోకకుండా రక్షిస్తుంది.