ప్రజలు ఇంట్లో తయారు చేసిన ఇడ్లీ, దోసలను చాలా ఉత్సాహంగా తింటారు
కానీ అవి పులియబెట్టిన ఆహారాలు అని మీకు తెలుసా.. ఇలాంటి ఆహారాలు శరీరానికి చాలా మంచివి
ఇవి తింటే పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే నిపుణులు డైట్‌లో పులియబెట్టిన ఆహారాలు ఉండాలని సూచిస్తారు
పులియబెట్టిన ఆహారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం
పులియబెట్టిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే మీ రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది
పులియబెట్టిన ఆహారాన్ని సరైన మార్గంలో తీసుకుంటే సులువుగా బరువు తగ్గుతారు
వీటిని తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు
శరీరంలో వాపులుంటే పులియబెట్టిన ఆహారాలని తింటే సరిపోతుంది